ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు కిట్లు పంపిణీ
ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు కిట్లు పంపిణీ
నెల్లూరు [చేజర్ల] రవికిరణాలు ఏప్రిల్ 10 :
చేజర్ల మండలంలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ షేక్ మెహతాబ్ వారి ఆధ్వర్యంలో గురువారం ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిడ్స్ పంపిణీ చేశారు.వైద్యాధికారి మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాపిస్తుందని ఈ వ్యాధి నివారణకు దోమలు కుట్టకుండా పుట్టకుండా ప్రజలు చూసుకోవాలని,ఫైలేరియా వ్యాధిగ్రస్తులు కిట్లు ఉపయోగించి శరీరంలో వ్యాధి సోకిన ప్రాంతాలను శుభ్రం చేసుకొని జాగ్రత్త వహించాలన్నారు.ఈ వ్యాధి సోకిన వారు సరైన చికిత్స తీసుకుంటే వ్యాధి ఉధృతం కాకుండా తగ్గుతుంది అని ప్రతి మూడు నెలలకు12రోజుల చొప్పున ఒక సంవత్సరంలో నాలుగు పర్యాయములు చికిత్స తీసుకోవాలని తెలియజేసి ఈ వ్యాధి నివారణకు ఇంటి ముందు మురుకు కాలువలలో మడ్డి ఆయిల్ స్ప్రే చెయ్యాలని తెలియజేశారు.అలాగే సిహెచ్ఓ కే.చంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వారు అందజేసిన కిట్లును ఫెలేరియా వ్యాధిగ్రస్తులు ఉపయోగించుకోవాలని వ్యాధి తీవ్రతను తగ్గించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్స్,ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.